8.05.2011

Icet 2011 Counselling

హాయ్,
రాష్ట్రము లో ఐ సెట్ కౌన్సెల్లింగ్ కోసం వెయిట్ చేస్తున్న వారి సంక్య తక్కువేమీ కాదు. ఐ సెట్ ఫలితాలు విడుదలై చాల కలం గడిచినపటికి, కౌన్సుల్లింగ్  కి సంబంధించి ఇంకా ఎటువంటి  సమాచారం రాక పోవటం తో విద్యార్థులు అయో మయం లో ఉన్నారు. ఐ సెట్ ప్రధాన వెబ్-సైట్ కొన్ని నెలలుగా ఎటువంటి సమాచారం అందిచక విద్యార్థులు సమాచారం కోసం తికమక పడ్తున్నారు.

గత సంవత్సరం ఈ సమయానికి ఐ సెట్ కౌన్సెల్లింగ్ పూర్తి అయి  ఉంది. ఏది ఏమి అయినప్పటికి ఐ సెట్ కౌన్సుల్లింగ్ ఈ నెలలో జరగుతుంది అనటం లో సందేహం లేదు. కాబట్టి విద్యార్థులు సిద్ధం అవ్వల్సింది గా కోరుతున్నాము.
ఐ సెట్ కౌన్సుల్లింగ్ ఆగష్టు 15 నుండి మొదలు అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం కోసం మల్లి విసిత్ చేయండి, లేదా http://www.icet2011.net ని చూడండి.

Mugguru

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం లో Dr D రామా నాయుడు సమర్పిస్తున్న "ముగ్గురు" చిత్రానికి V N ఆదిత్య దర్సకత్వం వహిస్తునరన్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం లో "నవదీప్", హ్యాపీ డేస్ ఫేం "రాహుల్ ", అవసరాల శ్రీను హీరోస్ గా నటిస్తుండగా శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్స్ గా పాత్రలను పోషిస్తున్నారు. "కోటి" ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రిమ సేన్ మరియు శివాజీ ఈ మూవీ లో గెస్ట్ రోలేస్ లో కనిపిస్తారని టాక్.

"మహా ముదుర్లు" అనే కాప్షన్ తో ఈ చిత్రం ఆగష్టు 19 న విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. 

BSNL 3G DATA CARDS

హాయ్ ! 
మన కంప్యూటర్ లేదా లాప్ టాప్ కి  డేటా కార్డు ని వాడుతూ ఇంటర్నెట్ వాడుకోవచ్చు అనేది మనకు తెలిసిన విషయమే. మొదట్లో 2G ని ఉపయోగించి డేటా కార్డ్స్ ద్వారా ఇంటర్నెట్ అందుబాటులో ఉండేది. ల్యాండ్ లైన్ లేదా బ్రాడ్ బ్యాండ్ లభించని ప్రదేశాలలో ఈ డేటా కార్డ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి అనటంలో సందేహం లేదు.
మన రాష్ట్రము లో ఇపుడు అన్ని నెట్ వర్క్ లు 3G సేవలను అందిస్తునాయి.

ఈ 3G సేవలు వలన ఇపుడు మనము డేటా కార్డు లను 3G సేవలతో ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రము లో ఇపుడు అన్ని నెట్ వర్క్ లు 3G  డేటా కార్డు లను మార్కెట్ లో ప్రవేశ పెట్టాయి. వాటిలో ముక్యంగా  చెప్పుకో తగినది BSNL  3G       డేటా కార్డు. ఇది 3.6mbps  మరియు 7.2mbps అనే రెండు మోడల్స్ లో లభిస్తుంది. 3.6mbps ధర  1600/- మరియు 7.2mbps ధర 2000/-.

నేను 7.2mbps డేటా కార్డు ను గత రెండు నెలలుగా  వాడుతునాను. నాకు నెట్ వర్క్ బిజీ గా ఉన్న సమయంలో 800kpbs  నెట్ వర్క్ బిజీ అంతగా లేని సమయంలో 1.5mbps స్పీడ్ లభించింది.
అన్నిటి కన్నా ముక్యంగా bsnl hacks ని ఉపయోగించి కేవలం bsnl మాత్రమే కాకుండా ఇతర నెట్ వర్క్ సిమ్ లను కూడా ఈ డేటా కార్డు లో వాడ వచ్చు. v-cell అనే software ని మన కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఇది సాధ్యపడింది. సో, నేను aircel సిమ్ ని డేటా కార్డు లో వేసి, 2G లో 144kpbs స్పీడ్ ని పొంధగాలుగుతునాను.
మరియు ఎయిర్ సెల్ అందిస్తున్న 97/- అన్ లిమిటెడ్ ప్యాక్ తో పూర్తిగా ఒక నెల రోజులపాటు ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడ్తుందని ఆశిస్తూ...సెలవు తీసుకుంటున్నాను.

Welcome to Telugu blog

నమస్కారము !
తెలుగు బ్లాగ్ కి స్వాగతం.
నా పేరు శివ. ఇది సినిమా పేరు కాదులెండి. తెలుగు వారి కోసం ఒక బ్లాగ్ నిర్వహించాలనేది నా ఆకాంక్ష. బ్లాగర్ అందిస్తున్న ఈ సదుపాయం ద్వారా ఇపుడు ఇది సాధ్య పడింది. ముక్యంగా ఈ బ్లాగ్ లో న్యూస్, టెక్నాలజీ సమాచారం, ఎడ్యుకేషన్ సమాచారం తెలుగు లో అందించ ధలిచాను. ఈ సమాచారం ఇంటర్నెట్ మరియు వివిధ పత్రికల ద్వార సేకరించి మీ కోసం తెలుగు లో  ఒక క్రమ పద్ధతిలో మీ ముందు ఉంచటానికి మరియు ప్రతిరోజూ ఒక మంచి విషయాన్నీ మీకు తెలుగు లో అందించటానికి ఈ బ్లాగ్ ని మొదలు పెట్టాను. మీరు ఆదరిస్తారని నచ్చక పోతే సలహా అందిస్తారని  కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.