8.05.2011

BSNL 3G DATA CARDS

హాయ్ ! 
మన కంప్యూటర్ లేదా లాప్ టాప్ కి  డేటా కార్డు ని వాడుతూ ఇంటర్నెట్ వాడుకోవచ్చు అనేది మనకు తెలిసిన విషయమే. మొదట్లో 2G ని ఉపయోగించి డేటా కార్డ్స్ ద్వారా ఇంటర్నెట్ అందుబాటులో ఉండేది. ల్యాండ్ లైన్ లేదా బ్రాడ్ బ్యాండ్ లభించని ప్రదేశాలలో ఈ డేటా కార్డ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి అనటంలో సందేహం లేదు.
మన రాష్ట్రము లో ఇపుడు అన్ని నెట్ వర్క్ లు 3G సేవలను అందిస్తునాయి.

ఈ 3G సేవలు వలన ఇపుడు మనము డేటా కార్డు లను 3G సేవలతో ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రము లో ఇపుడు అన్ని నెట్ వర్క్ లు 3G  డేటా కార్డు లను మార్కెట్ లో ప్రవేశ పెట్టాయి. వాటిలో ముక్యంగా  చెప్పుకో తగినది BSNL  3G       డేటా కార్డు. ఇది 3.6mbps  మరియు 7.2mbps అనే రెండు మోడల్స్ లో లభిస్తుంది. 3.6mbps ధర  1600/- మరియు 7.2mbps ధర 2000/-.

నేను 7.2mbps డేటా కార్డు ను గత రెండు నెలలుగా  వాడుతునాను. నాకు నెట్ వర్క్ బిజీ గా ఉన్న సమయంలో 800kpbs  నెట్ వర్క్ బిజీ అంతగా లేని సమయంలో 1.5mbps స్పీడ్ లభించింది.
అన్నిటి కన్నా ముక్యంగా bsnl hacks ని ఉపయోగించి కేవలం bsnl మాత్రమే కాకుండా ఇతర నెట్ వర్క్ సిమ్ లను కూడా ఈ డేటా కార్డు లో వాడ వచ్చు. v-cell అనే software ని మన కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఇది సాధ్యపడింది. సో, నేను aircel సిమ్ ని డేటా కార్డు లో వేసి, 2G లో 144kpbs స్పీడ్ ని పొంధగాలుగుతునాను.
మరియు ఎయిర్ సెల్ అందిస్తున్న 97/- అన్ లిమిటెడ్ ప్యాక్ తో పూర్తిగా ఒక నెల రోజులపాటు ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడ్తుందని ఆశిస్తూ...సెలవు తీసుకుంటున్నాను.